VKB: బషీరాబాద్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ దగ్గర బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాండూర్ నుంచి బషీరాబాద్ మార్గంలో నిత్యం తిరిగే బస్సుల కోసం ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. ఈ కారణంగా రోడ్డుపై వాహన రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.