MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి ఉమ్మడి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మంగళవారం ఉమ్మడి గ్రామ సర్పంచులు మహబూబాబాద్ డిపో మేనేజర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మద్దెల బిక్షపతి, ఇస్లావత్ నరేష్, నూనావత్ భద్రులు మాట్లాడుతూ.. కోమటిపల్లి పరిధిలోని గ్రామ ప్రజలు, విద్యార్థులకు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.