VZM: నగర రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40 ఏళ్లు, ఎత్తు 5 అడుగులు 4 అంగుళాలు ఉంటుందని సీఐ ఆర్వీఆర్కే.చౌదరి మంగళవారం తెలిపారు. మృతదేహంపై వైట్ బనియన్, నీలం షర్ట్ ఉన్నాయని చెప్పారు. కుడి నుదిటి, ఎడమ మోచేతిపై పుట్టుమచ్చలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.