ATP: గార్లదిన్నె మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు లాలు మరణంతో కృంగిపోయిన కుటుంబానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. బాధిత ఇంటికి వెళ్లి ఆత్మీయులను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, పకీరప్ప, రామాంజనేయులు పాల్గొన్నారు.