CTR: ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అడిషనల్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు ఆర్టీవో కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ బొమ్మ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.