SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 10 నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా అఫ్రీనా బేగం (మొహ్సిన్) దరఖాస్తును సమర్పించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆమె తన దరఖాస్తును ఎంఐఎం పార్టీ నారాయణఖేడ్ అధ్యక్షులు మోహీద్ పటేల్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు చాంద్ పాషా, మొహమ్మద్ సజీద్ ఉన్నారు.