NRPT: మక్తల్ పట్టణ వాసవి క్లబ్, వనిత క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన సమావేశంలో వాసవి క్లబ్ అధ్యక్షుడిగా మేడిశెట్టి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.తిరుపాలెశెట్టి, కోశాధికారిగా టి. పవన్ కుమార్ నియమితులయ్యారు. వనిత క్లబ్ అధ్యక్షురాలిగా కల్వాల ప్రసన్న, కార్యదర్శిగా నందిని ఎన్నికయ్యారు.