KRNL: జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు ఇవాళ పోలీసులు వాహానాల డ్రైవర్లకు ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. భద్రత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.