ATP: రాయదుర్గం పట్టణంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో మంగళవారం వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించారు.