NGKL: కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా, గట్టిపలపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని గట్టిపలపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతమైన కల్వకుర్తి అభివృద్ధికి జిల్లా హోదా ఎంతో అవసరమని పేర్కొన్నారు.