NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లతో హెడ్ కానిస్టేబుల్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అరైవ్-ఎలైవ్ కార్యక్రమం నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, సీటు బెల్టు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించి క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలన్నారు.