VSP: విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్లో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో సీ-1, జనరల్ బోగీల మధ్య చక్రాల నుంచి పొగలు రావడంతో గుల్లిపాడు వద్ద 20 నిమిషాలపాటు రైలును నిలిపివేశారు. మళ్లీ పొగలు రావడంతో తుని మండలం హంసవరం వద్ద రైలును నిలిపారు. హంసవరం వద్ద సుమారు గంటన్నరకు పైగా రైలు నిలిచింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.