KDP: జమ్మలమడుగు మండలం ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసుల రెడ్డి ఇవాళ జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత, కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దాదాపు 300 మంది అనుచరులతో టీడీపీలోకి చేరారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నారని, ఆ అభివృద్ధిని చూసి టీడీపీలో చేరానని శ్రీనివాస్ అన్నారు.