KNR: నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) ఆధ్వర్యంలో ఈనెల 23న కరీంనగర్ ఐటీ టవర్లో ‘ఇన్నోవేషన్ పంచాయత్’ నిర్వహించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ఆవిష్కర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిపుణుల సలహాలు, ప్రభుత్వ తోడ్పాటు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.