GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ అప్పల నాయుడు మంగళవారం సుల్తానాబాద్, బోసురోడ్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. డ్రెయిన్ల నిర్వహణ, డంపింగ్ యార్డులో వ్యర్థాల తరలింపును పరిశీలించిన ఆయన, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే ఫైకస్ పార్కును సందర్శించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని ఆదేశించారు.