NLG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు నాయకులు వార్డులు తిరుగుతున్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి పేరుపై ప్రభుత్వం లేఖను పంపించింది. ఇవాళ చిట్యాల, 7వ వార్డులో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోకల దేవదాసు, బోడ స్వామి, గంగాపురం గణేష్, మేడిశెట్టి ఉమాశంకర్, పోకల అశోక్, రాజేష్ లేఖలు పంపిణీ చేశారు.