తిరుపతి: జిల్లాలోని పులికాట్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదం సమస్య గురించి స్థానిక మత్స్యకారులు తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని సుమారు 24 గ్రామాల మత్స్యకారులకు పులికాట్ సరస్సు, దాని పరిసర తీర ప్రాంతాల్లో చేపల వేటే ప్రధాన జీవనాధారమని, అందులో ఐదు గ్రామాలు పూర్తిగా మత్స్యవృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని వారు ఎంపీకి వివరించారు.