NRML: ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల వివరాలను డీఐఈవో జాధవ్ పరుశురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్, 22న సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న బ్యాక్లాగ్ విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుందన్నారు.