RR: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు, వారి వైఫల్యాలను బయటపెడుతున్నందుకు మాజీ మంత్రి హరీష్ రావు పై కక్ష కట్టింది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని తెలిపారు.