ASR: డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువైద్య సిబ్బంది పాల్గొని మూగజీవులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. అలాగే పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పంచాయతీ కార్యదర్శి నరసయ్య పాల్గొన్నారు.