మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో 6 రోజులు జంతు గణన నిర్వహించనున్నట్లు FRO పూర్ణచందర్ మంగళవారం తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందితో పాటు బయట నుంచి స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్ల సహాయం తీసుకోనున్నట్లు చెప్పారు. మాంసాహార, శాఖాహార జంతువుల గణన, అడని స్థితిగతులను ఈ సందర్భంగా తెలుసుకోనున్నట్లు అధికారి వివరించారు.