BDK: జూలూరుపాడు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా మండలానికి చెందిన ఉసికల రమేష్‌ను నియమిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. తన ఎంపికకు సహకరించిన జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.