ASR: పెదబయలు మండలం వంచుర్భ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యంతో ఉన్న పోయిబ రాములమ్మను మంగళవారం ఉదయం డోలీలో ఆస్పత్రికి తరలించారు. సెంగెరెడ్డ వీధికి రహదారి లేకపోవడంతో గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. తరాలు మారుతున్నా.. తమ బతుకులు మారడం లేదని, అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.