పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ మధుగురు శివారులో సోమవారం రాత్రి అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలేశారు. స్థానిక మహిళలు గమనించి ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది చిన్నారిని రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.