ప్రకాశం: పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కమీషనర్ మారుతి రావు ఆధ్వర్యంలో వ్యాపారులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు తొలగించారు. గతంలో కూడా ఆక్రమణలు తొలగించినప్పటికీ, వ్యాపారులు మళ్లీ యధావిధిగా దుకాణాలను రోడ్డుపైకి తెచ్చారు. దీంతో అధికారులు ఈ చర్య చేపట్టారు.