GDWL: శాంతినగర్ పట్టణంలోని పల్లే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మంగళవారం శివనామ స్మరణతో మారుమోగింది. స్వాములు వేకువజామునే విశేష అభిషేకాలు, లింగాష్టక పఠనం నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, పూజల అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. శ్రీనివాసులు, కురవ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.