AP: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లిలోని విశ్వనాథుని ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయం వెనుక ఉన్న పుట్టలోంచి వచ్చిన ఓ నాగుపాము, గర్భగుడిలోని శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ‘హరహర మహాదేవ’ అంటూ భక్తితో స్మరించుకున్నారు, ప్రత్యేక పూజలు చేశారు. గతంలోనూ ఇక్కడ రెండుసార్లు ఇలాగే జరగడం విశేషం.