AP: వివేకా హత్య కేసులో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై వైఎస్ సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో చెప్పాలని CBIని సుప్రీంకోర్టు కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఎవరెవరిని విచారించాలో స్పష్టంగా చెప్పాలని, ఎవరిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది.