NLG: మిర్యాలగూడలో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ హడావిడిగా చేపడుతున్న ఈ పనుల్లో కేవలం కంకర, సిమెంట్ మాత్రమే వాడుతూ ఇసుకను వాడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.