KMM: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లా అధికారులు కేంద్రాల గుర్తింపు, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 35,188 మంది విద్యార్థులకు 66 కేంద్రాలను ఏర్పాటు చేసి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.