WGL: ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన నగరంలోని శంభునిపేటలో జరిగింది. 9వ తరగతి తమ కుమారుడు ఈశాల్ ఆడుకోవడానికి బయటికి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.