SRCL: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. టౌన్ సీఐ కృష్ణ, ట్రాఫిక్ ఎస్సై దిలీప్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.