WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ట్రాఫిక్ CI సుజాత ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 53 మంది నిందితులను పట్టుకున్నారు. అదే సమయంలో లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 8 మందికి రూ. 5,400 పెనాల్టీ విధించినట్లు ట్రాఫిక్ సీఐ సుజాత తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని అన్నారు.