NLR: సీతారామపురం ప్రధాన వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పూజారి గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.