చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో నిన్న ఒక ఏనుగు విద్యుత్ షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందగా, గత పది ఏళ్లలోనే 15 ఏనుగులు కరెంట్ షాక్కు బలయ్యాయి. ఏనుగుల భద్రత కోసం అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే అవి క్షీనించిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.