AP: ధాన్యం రైతులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై ధాన్యం కొనుగోలు చేసిన రోజే సాయంత్రం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వివరించారు.