ATP: నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి ఆలయంలో చక్కెర, టెంకాయల పూజ సామాగ్రిని ఈనెల 23న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శోభా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఈ వేలం పాట జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు రూ. 50 వేలు డిపాజిట్ చెల్లించి, వేలంలో పాల్గొనాలని సూచించారు.