PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభ్యుదయానికి పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ఇందిరా మహిళా శక్తి’ సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు రూ. 1,03,67,848 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.