NDL: మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ చేసిన ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి పాఠశాల HMతో పాటు డిప్యూటీ వార్డెన్, మరో టీచర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఒక సీఈఆర్టీని విధుల నుంచి ఇవాళ పూర్తిగా తొలగించారు.