JGL: వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ప్రణాళికలను ముందస్తుగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన జిల్లా నీటి, పారిశుధ్య కమిటీ సమావేశంలో నీటి సరఫరా, నాణ్యత, ఎఫెచ్ఎసీల పురోగతి, ఆపరేషన్ పనులను సమీక్షించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు అందించాలన్నారు.