GNTR: వాణిజ్య పంటల అభివృద్ధికి కేంద్రం కొత్త మిషన్పై దృష్టి సారించింది. పత్తి, మిర్చి వంటి పంటలను ఒకే చట్రంలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇది అమలైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు పెద్ద లాభం చేకూరనుంది. గుంటూరు మిర్చికి జాతీయ స్థాయి మద్దతు లభించే అవకాశం ఉంది. పరిశోధనలు, ఎగుమతులు, ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.