NLG: ఎన్జీ కాలేజీలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న ‘తెలుగు భాషా వికాసం–వివిధ వైఖరులు’ అంశంపై ఒక్కరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొనాలని కోరారు.