GNTR: పుట్టిన మూడు రోజులకే కన్నతల్లి ప్రేమకు దూరమై, ఓ ఆడ శిశువు అనాథగా మారిన ఘటన పట్టాభిపురంలోని మాతృశ్రీ ఆశ్రమం వద్ద విషాదాన్ని నింపింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ మహిళ, పసికందును ఆశ్రమం వద్ద వదిలి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో సోమవారం రికార్డయ్యాయి. ఈ హృదయవిదారక దృశ్యం చూసినవారు కంటతడి పెట్టారు. పోలీసులు శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.