KRNL: ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. సిరి మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈ-పంట బుకింగ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పురోగతి సాధించాలని,పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.