TG: కోకాపేటలోని తన నివాసం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ కు బయలుదేరారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ లో నేతలతో చర్చించిన తర్వాత.. సిట్ విచారణకు హాజరుకానున్నారు. సీపీ సజ్జనార్ నేతృత్వంలోని బృందం హరీష్ రావును విచారించనున్నారు.