MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎప్పుడు ఏం జరుగుతుందో చూసేందుకు ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. రాత్రి సమయంలో గాల్లో ఎగిరే డ్రోన్‌కు బిగించిన స్క్రీన్‌పై జాతరలో ఏం జరుగుతుందో డ్రోన్ కెమెరాతో లైవ్‌గా వీక్షించే వీలు కల్పించారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు సూచనలు, ప్రకటనలు చేయడానికి ఈ అద్భుత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.