NLR: చేజెర్ల మండలం నేర్నూరు, చిత్తలురూ గ్రామాలలో NFSM క్లస్టర్ డెమోస్ జొన్న, శెనగ పంటలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ADA (R) శివనాయక్, మండల వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. చవుడును నిర్ములించాలన్నారు. ఈ కార్యక్రమంలో AEO L.సుజాత, VAAలు నాగభూషణం, ఝాన్సీ, రైతులు పాల్గొన్నారు.