PPM: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజల ముంగిటకే’ కార్యక్రమంలో ఆయన నేరుగా వినతులు స్వీకరించారు. వచ్చిన 15 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.