BHNG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.