నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన మెదడు సహజంగానే మనల్ని ఏ పనీ చేయనివ్వకుండా కట్టడి చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవడం, మానసిక కుంగుబాటుకు లోనవ్వడం వంటివి అప్రయత్నంగానే అలవాటుగా మారిపోతాయి. అందుకే మనసు ఎంత భారంగా ఉన్నా, మెదడుకు ఆ నిస్సహాయతను అలవాటు చేసుకోనివ్వకూడదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక చిన్న పని చేస్తూనే ఉండాలి